: వేషం మార్చి, సిన్సినాటిలో ఐస్ క్రీం అమ్మిన ఆండీ ముర్రే!


రెండు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న వరల్డ్ నంబర్-2 టెన్నిస్ దిగ్గజం ఆండీ ముర్రే ఐస్ క్రీం అమ్మేవాని వేషం వేశాడు. తలకో విగ్గు పెట్టుకుని, పెద్ద కళ్లద్దాలు, తలపై బేస్ బాల్ క్యాప్ ధరించి ఓ పార్లర్ లో నిలబడి ఐస్ క్రీం అమ్ముతుంటే ఎవరూ గుర్తించలేకపోయారట. చాలా సేపటి తరువాత ఓ కొనుగోలుదారు గుర్తు పట్టాడు. అంతే, అక్కడి వాతావరణమే మారిపోయింది. ఆండీ సైతం సరదాగా వారితో చేతులు కలుపుతూ కాసేపు ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ మొత్తం ఉదంతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గత ఆదివారం నాడు జకోవిచ్ ని ఓడించడం ద్వారా మాంట్రియల్ మాస్టర్స్ ట్రోఫీని ముర్రే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News