: మా భూములకు మినహాయింపు ఇవ్వండి... విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం ముందు రైతుల ఆందోళన
ఏపీ రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నిడమర్రి గ్రామాల్లో ఈ రోజు నుంచి భూసేకరణ చేయనుండటంతో ఆ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. మూడు పంటలు పండే తమ భూములను భూసేకరణ, భూసమీకరణ ద్వారా తీసుకోకుండా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనకు సీపీఎం, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం భూములను తీసుకుంటే ఏయే పంటలకు నష్టం జరుగుతుందనే విషయాన్ని తెలిపేందుకు పండ్లు, కూరగాయలతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.