: నిజంగా కిషన్ రెడ్డికి అంత పలుకుబడే ఉంటే తెలంగాణకు ప్యాకేజీ తీసుకురావాలి: కేటీఆర్


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి టీఎస్ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డికి నిజంగా కేంద్రంలో పలుకుబడి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని ఛాలెంజ్ చేశారు. బీహారుకు కేంద్ర ప్రభుత్వం లక్ష అరవై ఐదు వేల కోట్ల ప్యాకేజీ ఇస్తోందని... కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ కూడా ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని... అందువల్ల ఇక్కడి బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్యాకేజీ తీసుకురావాలని అన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో కలుస్తున్నప్పుడు కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News