: కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతోందన్న తెలంగాణ... అభ్యంతరం తెలిపిన మహారాష్ట్ర


కృష్ణా నదీ జలాల్లో తమకు అన్యాయం జరుగుతోందని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వైద్యనాథన్ చేసిన వాదనలకు మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయం కారణంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని వాదించారు. అయితే ఇందులో కొత్త విషమేమీ లేదని మహా ప్రభుత్వ తరపు న్యాయవాది అంద్యార్జున్ అన్నారు. కృష్ణా జలాల్లో పంపిణీ మళ్లీ చేపట్టాలని కోరుతూ తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పై వాదనలు జరిగాయి. అయితే కృష్ణా జలాల వివాదంపై ఇప్పటికే విచారణలో ఉన్న అన్ని కేసులతో కలిపి తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై కూడా విచారణ చేపడతామని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నెల 26న అన్ని పిటిషన్లు విచారణకు రానున్నాయి.

  • Loading...

More Telugu News