: జమ్మూలో మత ఘర్షణలు... కర్ఫ్యూ


జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లా రాయమోర్ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగాయి. నిన్న సాయంత్రం చెలరేగిన ఈ ఘర్షణలను అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించారు. ఘర్షణల్లో భాగంలో జిల్లా మేజిస్ట్రేట్ వాహనంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనం ధ్వంసమైంది. అంతేకాకుండా, ఘర్షణల కారణంగా పలువురు పోలీసులు గాయపడ్డారు. బారి బ్రాహ్మణ ప్రాంతంలో మత గ్రంధాల విషయమై ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. అది కాస్త పెద్దదై, ఇరు వర్గాల మధ్య చిచ్చు రేగింది.

  • Loading...

More Telugu News