: మోదీ సిలికాన్ వ్యాలీ విందుకు పోటెత్తిన స్పందన...24 గంటల్లో 10 వేల మంది రిజిస్ట్రేషన్


భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ఇంకా నెలకు పైగానే సమయముంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం వచ్చే నెల చివరలో మోదీ అమెరికా వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 500లకు పైగా ప్రవాస భారత సంతతి అమెరికన్ సంస్థలు మోదీకి భారీ విందు ఇవ్వనున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో వచ్చే నెల 27న జరగనున్న ఈ విందుకు హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్నవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్న విజ్ఞప్తికి భారీ స్పందన లభించింది. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News