: శంషాబాద్ విమానాశ్రయంలో దంపతుల నుంచి బంగారం పట్టివేత


హైదరాబాదు సమీపంలోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ఉదయం విమానాశ్రయంలో 625 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటిలాగే ముందస్తు సమాచారంతో సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ముంబైకి చెందిన దంపతుల వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న 625 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News