: 32 ఏళ్ల వయసే పెళ్లికి కరెక్ట్ ఏజ్: అలియా భట్


పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ 32 ఏళ్లని బాలీవుడ్ భామ అలియా భట్ చెప్పింది. తనకింకా 22 ఏళ్లేనని... పెళ్లి చేసుకోవడానికి ఇంకో పదేళ్లు ఆగొచ్చని తెలిపింది. జనరల్ నాలెడ్జ్ లో అలియా భట్ వీక్ అయినా... తనకు కాబోయే మొగుడు ఎలా ఉండాలన్న దానిపై మాత్రం పూర్తిగా స్పష్టతతో ఉంది. చూడ్డానికి బాగుండాలని, హాస్య చతురత కలిగి ఉండాలని చెప్పింది. అంతేకాదండోయ్, తన ఇష్టాయిష్టాలు తెలిసిన వాడై కూడా ఉండాలని తెలిపింది. తన స్నేహితురాలు అనుష్క రాజన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న 'వెడ్డింగ్ పలావ్' సినిమాను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ అలియా ఈ వివరాలు వెల్లడించింది.

  • Loading...

More Telugu News