: భూసేకరణపై రణమే!... సీఆర్డీఏ ముందు నేడు ధర్నాకు పిలుపునిచ్చిన విపక్షాలు


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం ఏపీ సర్కారు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ సహా విపక్షాలు కాంగ్రెస్, వామపక్షాలు కూడా భూసేకరణ చట్టం నోటిఫికేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజధాని నిర్మాణం కోసం రైతులను ఒప్పించి భూములు తీసుకోవాల్సిన ప్రభుత్వం, బలవంతంగా భూములను లాక్కునేందుకే భూసేకరణ నోటిఫికేషన్ ను జారీ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ముందుకు సాగుతోందని ఆరోపిస్తున్న ఆ పార్టీలు, ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు సీఆర్డీఏ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించాయి.

  • Loading...

More Telugu News