: నవ్యాంధ్రలో భూసేకరణ చట్టం ప్రయోగం... నోటిఫికేషన్ జారీ చేసిన గుంటూరు కలెక్టర్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం అస్త్రాన్ని ప్రయోగించింది. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) కింద రాజధాని పరిసర గ్రామాల పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం 33,400 ఎకరాల భూమిని సేకరించింది. మరో 3,892 ఎకరాల భూమి కావాలని చెబుతున్న ప్రభుత్వం భూసేకరణ చట్టం అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. జీవో నెం. 304 పేరిట జారీ అయిన ఈ జీవోలో అమరావతి పరిధిలోని తుళ్లూరు(2), శాఖమూరు, బోరుపాలెం, పిచుకలపాలెం, అనంతవరం, నేలపాడు, ఐనవోలు, అబ్బురాజుపాలెం, దొండపాలెం, కొండమరాజుపాలెం రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల పరిధిలోని భూములను సేకరించేందుకు ప్రభుత్వం 26 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను రంగంలోకి దించింది. రేపు మరో 19 గ్రామాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ జారీ కానుంది. భూసేకరణ చట్టం నోటిఫికేషన్ జారీతో రాజధాని గ్రామాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.