: నా లైఫ్ లో బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే: మహేష్ బాబు


ఏలూరులో చిన్న పిల్లాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, 'శ్రీమంతుడు' సినిమా చూసిన అనంతరం మహేష్ బాబును చూస్తాననడంతో నిన్న అతనిని కలిశానని మహేష్ బాబు చెప్పాడు. ఈ సందర్భంగా ఆ పిల్లాడు "శ్రీమంతుడు సినిమా చూశాను. ఇట్స్ మార్వ్ లెస్" అన్నాడని, అదే తన జీవితంలో గొప్ప ప్రశంసగా భావిస్తున్నానని మహేష్ బాబు చెప్పాడు. 'శ్రీమంతుడు' సినిమా విడుదలకు ముందు అభిమానులను ఎలా ఫేస్ చేయాలో తెలియలేదని, ఇప్పుడు అందర్నీ బాగానే ఫేస్ చేస్తున్నానని మహేష్ తెలిపాడు. తన తండ్రి అభిమానుల్లో ఉన్న లక్షణం ఏంటంటే...నిష్పాక్షికంగా ఉన్నదున్నట్టు చెప్తారని, ఆ లక్షణమే తనకు నచ్చుతుందని మహేష్ బాబు చెప్పాడు. 'శ్రీమంతుడు'సినిమా విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలని మహేష్ బాబు తెలిపాడు.

  • Loading...

More Telugu News