: ఆ మిస్టరీ రైలు ఆచూకీ కనిపెట్టేశారట... వాటా ఇస్తే చెబుతారట!
రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తున్న సమయంలో నాజీల ఓటమి తప్పదని గ్రహించిన జర్మన్ నియంత హిట్లర్ పోలండ్ లో దాచిన బంగారం, రత్నాల రాశులను జర్మనీ తరలించాలంటూ ఆజ్ఞాపించాడు. దీంతో 1945లో 23 కంటైనర్లలో ఆయుధాలు, బంగారం, డబ్బు, వజ్రాలు, విలువైన రాళ్లు, రత్నాలతో పోలండ్ లోని బ్రాక్లో నుంచి ఈ రైలు బయల్దేరింది. అయితే, పోలిష్ పర్వతాల్లోని సొరంగ మార్గంలో కనిపించకుండా పోయింది. విషయం తెలిసిన హిట్లర్ అప్పట్లోనే ఆ సొరంగాలను మూసేశారు. అప్పటి నుంచి ఆ రైలును కనుగొనేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ, ఎవరూ దాని ఆచూకీ కనుగొనలేకపోయారు. అయితే ఆ రైలును కనిపెట్టేశామని ఇద్దరు గుప్త నిధుల వేటగాళ్లు చెబుతున్నారు. ఆ నిధిలో వాటా ఇస్తేనే అదెక్కడుందో చెబుతామని అంటున్నారు. ఆ నిధి దొరికితే బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు దొరికినట్టే...మరి వారి మాటలపై జర్మనీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!