: తండ్రి చేసిన గొప్పపని కుమారుడికి 7.32 లక్షల బహుమానం తెచ్చిపెట్టింది


మౌంటెన్ మ్యాన్ దశరథ్ మాంఝీ చేసిన సాహసం అతని కుమారుడికి 7.32 లక్షల రూపాయలు వచ్చేలా చేసింది. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపే వ్యక్తి దశరథ్ మాంఝీ అని అంతా కొనియాడుతున్నారు. అతని జీవితకథతో తెరకెక్కిన సినిమా విడుదల సందర్భంగా దశరథ్ మాంఝీ స్వగ్రామమైన గెహ్లార్ సందర్శించిన సినిమా యూనిట్ మాంఝీ కుమారుడికి 7.32 లక్షల రూపాయల పారితోషికం అందజేశారు. మరోవైపు బీహార్ లో మాంఝీ రాజకీయాలు నడుస్తున్నాయి. దశరథ్ మాంఝీ బతికి ఉండగా ఆయనను కలిసిన సందర్భాలను సీఎం నితీష్ కుమార్ గుర్తు చేసుకోగా, ఆయన స్వగ్రామం గెహ్లార్ కు ఏ విధమైన సాయం చేయలేదని నితీష్ పై మాజీ ముఖ్యమంత్రి జతిన్ రామ్ మాంఝీ విమర్శించారు. ధశరథ్ మాంఝీ దళితుడు కాకపోయి ఉంటే భారత రత్న అయి ఉండేవాడని జతిన్ రామ్ మాంఝీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News