: సముద్రంలో బంగారు నాణేలు దొరికాయి!
మూడు శతాబ్దాల క్రితం క్యూబా నుంచి స్పెయిన్ వెళుతున్న ఓ నౌక సుడిగాలి కారణంగా సముద్రంలో మునిగిపోయింది. అందులోని బంగారు నాణేలు సముద్రం పాలయ్యాయి. ఇప్పుడా నాణేలు నిధుల అన్వేషకులకు దొరుకుతున్నాయి. తాజాగా, అమెరికాలోని ఫ్లోరిడా వద్ద అట్లాంటిక్ సముద్రంలో అన్వేషకులకు పెద్ద సంఖ్యలో పసిడి నాణేలు దొరికాయి. వాటి విలువ చాలా భారీగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు ఇక్కడ దాదాపు 350 నాణేలను అన్వేషకులు చేజిక్కించుకున్నారట. ఫ్లోరిడా వద్ద సముద్రంలో ఇలా నిధుల కోసం అన్వేషించడం సాధారణ విషయమట.