: రాష్ట్రంలో భూ పిశాచి ప్రభుత్వం పాలన సాగిస్తోంది: 'సీపీఐ' రామకృష్ణ


సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర సర్కారుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూ పిశాచి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మండిపడ్డారు. రాజధాని పేరుతో గుంటూరు వద్ద 30 వేల ఎకరాలు, కృష్ణా జిల్లాలో 15 వేల ఎకరాలు లాక్కున్నారని, ఇంకా ఎన్నివేల ఎకరాలు తీసుకుంటే వీరి దాహం తీరుతుందో తెలియడంలేదని మండిపడ్డారు. మూడు పంటలు పండే భూములను కూడా పిశాచాల మాదిరిగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూ దాహంతో పాలకులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News