: మరో మూడు వారాలు మాత్రమే బతుకుతాననుకున్నా!: అమెరికా మాజీ అధ్యక్షుడు
కేన్సర్ సోకిందని తెలిసిన తరువాత మహా బతికితే మరో మూడు వారాలు బతుకుతానని భావించానని మెదడు కేన్సర్ తో బాధపడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ తెలిపారు. మూడు వారాలకోసారి కీమో థెరపీ, రేడియేషన్ చికిత్సలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. తొలిసారి పరీక్షల తరువాత మూడువారాలే బతుకుతానని భావించినా, ఇప్పుడు ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఇప్పుడు దేనికైనా సిద్ధమని, కొత్త సాహసాలు చేసేందుకు ఎదురుచూస్తున్నానని ఆయన వెల్లడించారు.