: తనిచ్చే ఊరట చాలా గొప్పగా ఉంటుంది: అర్ధాంగికి 'చిరు' కితాబు


తన జీవితంలో భార్య సురేఖ పాత్ర ఎనలేనిదని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తాను ఎలాంటి ఫీలింగ్సునైనా పంచుకోగలిగే వ్యక్తి సురేఖ మాత్రమే అని ఎమోషనల్ గా చెప్పారు. తనిచ్చే ఊరట చాలా గొప్పగా ఉంటుందని అన్నారు. తమ మధ్య వైవాహిక బంధాన్ని మించిన అనుబంధం ఉందని తెలిపారు. అయితే, తను ఏదైనా చెబితే, అది జరిగి తీరాల్సిందేనని చెప్పారు. సురేఖ తర్వాత రామ్ చరణ్ తోనూ, కుమార్తెలతోనూ, తమ్ముడు నాగబాబుతోనూ సన్నిహితంగా ఉంటానని వివరించారు. మెగా ఫ్యామిలీలో ఉన్న తొమ్మిది మంది నటులు తన లేటెస్ట్ ప్రాజెక్టులో చిన్న పాత్రయినా ఇవ్వమని అడుగుతున్నారని చిరంజీవి తెలిపారు. అయితే, 'మనం' సినిమాలో కుదిరినట్టు, ఫ్యామిలీ కాంబినేషన్ అన్ని వేళలా కుదరదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News