: ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు అత్యంత సంపన్నుడు!
35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న సంపన్నులలో అగ్రగణ్యుడు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ అని వెల్త్ ఎక్స్ తెలిపింది. వెల్త్ ఎక్స్ విడుదల చేసిన అంత్యంత సంపన్నుల జాబితా నివేదికలో ఇది వెల్లడైంది. 31 సంవత్సరాల జుకెర్ బర్గ్ ఆస్తుల విలువ 41.6 బిలియన్ డాలర్లు. దీంతో అత్యంత పిన్న వయసు సంపన్నుల జాబితాలో ఆయన అగ్రస్థానం సంపాదించారు. ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు డస్టిన్ మాస్కోవిజ్ (9.3 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో నిలవగా, ఎడువార్డో సావరిన్ (5.3 బిలియన్ డాలర్లు) నాలుగో స్థానంలో నిలవడం విశేషం. వెల్త్ ఎక్స్ విడుదల చేసిన 20 మంది సంపన్నుల జాబితాలో ఆరుగురు మహిళలు కూడా స్థానం సంపాదించడం విశేషం. ఆరుగురు మహిళల్లో చైనాకు చెందిన హుయాన్ యాండ్ 5.9 బిలియన్ డాలర్లతో ముందున్నారు.