: నా దారి వేరు, పవన్ దారి వేరు... ఇది క్లియర్: చిరంజీవి


నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తన 60వ జన్మదినం ముంగిట ఓ వార్తా చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చాలా అంశాలపై తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. ముఖ్యంగా, సోదరుడు పవన్ కల్యాణ్ గురించి చెప్పారు. రాజకీయంగా పవన్ దారి వేరని, తన దారి వేరని, ఈ విషయం సుస్పష్టమని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడైతే రాజకీయంగా తామిద్దరం కలిసేది లేదని స్పష్టం చేశారు. ఇక, కాంగ్రెస్ లో తన ప్రస్థానం వివరిస్తూ కాసింత నిర్వేదం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడున్న పార్టీ తనది కాదని, అందులో తన ఇష్టాయిష్టాలకు చోటు లేదని శ్లేష ధ్వనించేలా వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎన్నో వైవిధ్యభరితమైన అనుభవాలు చవిచూశానని చెప్పుకొచ్చారు. తొలుత ఓ పార్టీకి అధ్యక్షుడినని, ఆ తర్వాత ఎన్నికల్లో ఒకచోట ఓడిపోయి మరోచోట గెలిచానని, అటుపై ఎంపీ, ఆ పిమ్మట కేంద్ర మంత్రిని అయ్యానని వివరించారు. ప్రస్తుతం తన లక్ష్యం ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవడమని వెల్లడించారు. దాని కోసం అందరితో కలిసి పోరాడుతానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News