: వచ్చేనెల గ్రహశకలం భూమిని ఢీ కొడుతుందా?...గల్ఫ్ తీరం నాశనమవుతుందా?... నాసా వివరణ!


వచ్చే నెలలో గ్రహశకలం భూమిని ఢీ కొట్టనుందా? అట్లాంటిక్, గల్ఫ్ తీరాలు నాశనం కానున్నాయా? సోషల్ మీడియాలో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఇదే. ఎవరు పుట్టించారో ఎలా పుట్టించారో తెలియదు కానీ, వచ్చే నెల ఓ గ్రహశకలం భూమిని ఢీ కొట్టనుందనే పుకారు షికారు చేస్తోంది. దీనిపై బ్లాగర్లు, సోషల్ మీడియా ఔత్సాహికులు పుంఖాను పుంఖాలుగా కథనాలు వండివారుస్తున్నారు. అట్లాంటిక్, గల్ఫ్ తీరాల వద్ద ఇది భూమిని ఢీ కొట్టనుందని, అది ఢీ కొట్టిన ప్రాంతం మొత్తం నాశనమవుతుందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో నాసా రంగంలోకి దిగింది. అవన్నీ పుకార్లని, నిరాధారమైన వార్తలని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ లో షికారు చేస్తున్న వార్తలను పట్టించుకోకుండా నిశ్చింతగా ఉండాలని నాసా పిలుపునిచ్చింది.

  • Loading...

More Telugu News