: కోయకుండానే కన్నీళ్లు రప్పిస్తున్న ఉల్లి!


కన్నీళ్లు పెట్టించడంలో సమానత్వం పాటించే ఉల్లి మరింత ఘాటెక్కింది. ఉల్లి ధర రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. క్వింటాల్ ఉల్లి 4900 కు చేరింది. నిన్నటికి, నేటికి 400 రూపాయల తేడా కనిపిస్తోంది. ఇది పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా అందర్నీ ఆందోళనలోకి నెడుతోంది. దేశ రాజధానిలో కేజీ ఉల్లి 80 రూపాయలు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రైతుబజార్లలో ఉల్లి కొంత మందికి అందుబాటు ధరల్లోనే ఉంది. రిటైలర్ల దగ్గర కొనాలంటే కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి. కేజీ 50 రూపాయలు దాటుతోంది. ఖరీఫ్ సీజన్ లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులవల్లే ఉల్లి ఉత్పత్తి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఉల్లిని తెప్పించుకునేందుకు పంజాబ్ వంటి రాష్ట్రాలు విదేశాలను సంప్రదిస్తున్నాయి. ఈ విధంగా కోయకుండానే ఉల్లి కన్నీళ్లు రప్పిస్తోంది.

  • Loading...

More Telugu News