: స్మిత సబర్వాల్ కు తెలంగాణ ప్రభుత్వం న్యాయ సహాయం
ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం జాతీయ పత్రిక ఔట్ లుక్ ప్రచురించిన కథనంపై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ అంశంలో ఔట్ లుక్ పత్రికపై న్యాయపోరాటం చేసేందుకు స్మిత సబర్వాల్ కు న్యాయ సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 15 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.