: ర్యాగింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలను ఆదేశించా: గవర్నర్
ర్యాగింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించినట్టు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల మంత్రులకు కూడా సూచించినట్టు చెప్పారు. ర్యాగింగ్ ను ఎక్కడా అనుమతించమని, త్వరలో ర్యాగింగ్ పై మంత్రులతో సమావేశం నిర్వహిస్తానని గవర్నర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో వున్న గవర్నర్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కొద్దిసేపటి కిందట భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ విధంగా చెప్పారు.