: దుండగుల నుంచి రెండు కంట్రీమేడ్ తుపాకులు స్వాధీనం చేసుకున్నాం: అడిషనల్ డీసీపీ


హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో నీరూస్ షోరూమ్ సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దొంగలను పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ కోటిరెడ్డి వివరణ ఇచ్చారు. పక్కా సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు దొంగలను వెంబడించారని ఆయన తెలిపారు. అయితే, పోలీసులను గమనించిన దొంగలు కాల్పులు జరిపారని... కానీ, స్థానికుల సహాయంతో దొంగలను పట్టుకున్నామని వెల్లడించారు. వారి వద్ద నుంచి రెండు కంట్రీమేడ్ (నాటు) తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. షాపింగ్ మాల్స్ ను దొంగలు టార్గెట్ చేసినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News