: బీద రైతును మోసం చేసిన ప్రభుత్వ తీరును ప్రసారం చేసిన బీబీసీ


'అఛ్చేదిన్ ఆయేగా' అని ఒకరంటే, 'రాజధానికి భూములివ్వండి, ధనవంతులు కండి' అంటూ మరొకరు ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఐదేళ్లకోసారి మారే ప్రభుత్వ విధానాల తీరును కళ్లకు కట్టే ఉదంతాన్ని బీబీసీ ప్రసారం చేసింది. వివరాల్లోకి వెళ్తే... జమ్మూకాశ్మీర్ లోని బందిపొర జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహ్మద్ సుభాన్ వాని అనే వ్యక్తిని 1998లో ఓ ప్రభుత్వాధికారి కలిసి గ్రామంలో స్కూలు ఏర్పాటు చేసేందుకు స్థలం ఇవ్వాలని, భవిష్యత్ తరాలు బాగుపడతాయని, భూమి ఇచ్చినందుకు ప్రతిగా ప్రభుత్వం కొంత డబ్బు పరిహారంగా ఇస్తుందని, అలాగే స్కూల్లో ఉద్యోగం కూడా ఇస్తుందని తెలిపారు. ఆయన చెప్పిన మాటలు నమ్మిన సుభాన్ వాని భూమి ఇచ్చారు. దీంతో 1998లో అతనిని 25 రూపాయల జీతంతో ఆ స్కూలులో స్వీపర్ కమ్ చౌకీదార్ గా నియమిస్తూ అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారు. ఆనాటి నుంచి 2005లో ఆయన రిటైర్ అయ్యేవరకు 17 ఏళ్ల పాటు ఆయన అదే స్కులులో స్వీపర్ గా 25 రూపాయల జీతానికే పని చేశారు. పరిహారం ఇవ్వాలని కోరుతూ, జీతం పెంచాలని కోరుతూ ఆయన కలవని అధికారి, రాజకీయ నాయకుడు లేరని సుభాన్ వాని చెప్పారు. ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని ఆయన కుమారుడు అందుకున్నాడు. నిండా చెట్లతో ఉన్న తన భూమిని స్కూలుకి దానం చేయడం పెద్ద తప్పు అవుతుందని తాను ఆనాడు భావించలేదని అభిప్రాయపడ్డారు. చెట్ల ద్వారా వచ్చే ఆదాయన్ని వదులుకుని, స్కూలు కోసం భూమిని ఇచ్చి తన కుమారుల భవిష్యత్ ను కష్టాలపాల్జేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి రిటైర్మెంట్ తరువాత 2005 నుంచి విధుల్లో చేరిన ఆయన కుమారుడికి మూడు నెలలుగా ఆ జీతం కూడా రావడం లేదని ఆయన వెల్లడించారు. ఆయన కథనాన్ని బీబీసీ ప్రసారం చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News