: ట్విట్టర్ లో రాధేమాను ఫాలోవుతున్న బ్రిట్నీ స్పీయర్స్!


కట్నం కేసులో ఇరుక్కుని కొన్ని రోజుల నుంచి వార్తల్లో హల్ చల్ చేస్తున్న ఆధ్యాత్మిక గురువు రాధేమాకు పాప్యులారిటీ పెరుగుతోంది. ఆమె గురించి వ్యతిరేక వార్తలు వస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పలువురు ఆమెను అనుసరిస్తున్నారు. వారిలో ఏకంగా ఓ పాప్ సింగరే ఆమెను ఫాలో అవడం విశేషంగా చెప్పుకోవాలి. ఇంతకీ ఆ సింగర్ ఎవరనుకుంటున్నారా? ఆమే ప్రఖ్యాత పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్. రాధేమా గురించి వార్తలు వస్తుండటంతో 'రాధేమా భక్త్' పేరుతో ఓ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. అందులోనే బ్రిట్నీ ఆమె ఫాలోవర్ గా చేరింది. సోషల్ మీడియాలో ఓ పేరడీ అకౌంట్ అయిన ఆ ఖాతాకు 1841 మంది ఫాలోవర్లు ఉన్నారట. వారిలో బ్రిట్నీ స్పీయర్స్ కూడా ఒకరు. వారిద్దరికీ సంబంధమేంటా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News