: మావోయిస్టుల అజెండానే కేసీఆర్ అజెండా: కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ ది సోషలిస్ట్ అజెండా అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. మావోయిస్టులు ఏం సాధించాలని పోరాడుతున్నారో... అదే ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. మావోయిస్టులు అడవిని వదలిపెట్టి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని... ప్రజా సంక్షేమంలో భాగస్వాములు కావాలని కోరారు. బీర్ పూర్, తుంగూరులలో 'మన ఊరు - మన ఎంపీ' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.