: సచిన్ మాటలు నాలో కసిని పెంచాయి: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్
ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపికైన బ్యాడ్మింటన్ ఆశాకిరణం కిదాంబి శ్రీకాంత్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాటలు తనలో కసిని పెంచాయని అన్నాడు. సచిన్ ను కలవడం తన జీవితంలో మరపురాని ఘట్టమని పేర్కొన్నాడు. ఆయనో దిగ్గజం అని, తానూ ఆయననే ఆదర్శంగా తీసుకుంటానని తెలిపాడు. సచిన్ తన అంకుల్ స్నేహితుడని వెల్లడించాడీ తెలుగుతేజం. తన అంకుల్ ను కలవడానికి సచిన్ వచ్చాడని, అప్పుడే ఆయనతో మాట్లాడానని వివరించాడు. కొన్ని నిమిషాలే ముచ్చటించానని, అయితే, ఎంతో ప్రోత్సాహకరంగా మాట్లాడాడని చెప్పాడు. "ఏదో ఒక రోజున నువ్వు తప్పకుండా వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారుడిగా అవతరిస్తావు" అని సచిన్ ఆ సందర్భంగా ప్రోత్సాహ వచనాలు పలికారని శ్రీకాంత్ తెలిపాడు.