: గాల్లో ఢీ కొట్టుకున్న విమానాలు


విమాన ప్రమాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వైఫల్యమో? లేక పైలట్ల నిర్లక్ష్యమో? కానీ వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈరోజు పశ్చిమ స్లోవేకియాలో ప్రయాణిస్తున్న రెండు విమానాలు గాల్లో ఢీ కొట్టాయి. స్లోవేకియాలోని సర్వనీ కామెన్ గ్రామ పరిసరాల్లో ఎదురెదురుగా వస్తున్న విమానాలు ఢీ కొట్టి, కూలిపోయాయి. ఈ విమానాలు ఏ రకానికి చెందిన విమానాలు? ఆయా విమానాల్లో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు? అనే విషయాలు నిగ్గుతేల్చేందుకు సహాయక బృందాలు బయల్దేరాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలైనట్టు అధికారులు చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News