: రేవంత్ రెడ్డి విడుదల... కేసీఆర్ కు ఇక మూడిందేనని హెచ్చరిక


మహబూబ్ నగర్ లో ఈ రోజు అరెస్టైన టి.టీడీపీ నేత రేవంత్ రెడ్డి జిల్లాలోని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి కొద్దిసేపటి కిందట విడుదలయ్యారు. ఆ వెంటనే సీఎం కేసీఆర్ పై రేవంత్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికీ చీఫ్ లిక్కర్ ద్వారా తెలంగాణ సాధ్యమా? అని ప్రశ్నించారు. యూపీ, బీహార్ లిక్కర్ మాఫీయాతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఇక తెలంగాణలో ఆయనకు కాలం మూడినట్టేనని రేవంత్ హెచ్చరించారు. మహబూబ్ నగర్ లో కొత్తగా నిర్మించిన మార్కెట్ యార్డ్ కు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాన కార్యక్రమానికి హాజరవుతున్న క్రమంలో అక్కడికి చేరుకున్న రేవంత్ ధర్నాకు దిగారు. ప్రొటోకాల్ ప్రకారం తమను ఆహ్వానించలేదని ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News