: అమెరికాలో మార్టినెజ్ సిటీకి పోలీస్ చీఫ్ గా భారత సంతతి వ్యక్తి


అమెరికాలో పలు కీలక పదవుల్లో భారత సంతతి వ్యక్తుల నియామకం ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నదే. తాజాగా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని మార్టినెజ్ సిటీకి భారత సంతతి వ్యక్తిని పోలీస్ చీఫ్ గా నియమించారు. రిచ్ మండ్ పోలీస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మంజీత్ సప్పల్ ను బుధవారం 5-0 ఓటింగ్ తో మార్టినెజ్ పోలీస్ చీఫ్ గా ఎన్నుకున్నారు. నగర పోలీస్ చీఫ్ గా సప్పల్ ఏడాదికి రూ.1.14 కోట్లు కనీస వేతనంగా అందుకుంటారు. తన నియామకంపై సప్పల్ మాట్లాడుతూ... మార్టినెజ్ ఓ గొప్ప నగరం అని, ఈ అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News