: ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ క్రికెటర్లకు 'మాస్టర్' సలహాలు
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ శుక్రవారం చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ లో కుర్రాళ్లతో ముచ్చటించనున్నారు. ఫౌండేషన్ కోచింగ్ డైరక్టర్ గ్లెన్ మెక్ గ్రాత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్నాళ్లుగా మెక్ గ్రాత్ చెన్నైలోనే ఉన్నారు. రేపు సచిన్ కూడా ఆయనకు జత కలుస్తాడు. ఈ సందర్భంగా ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ లో శిక్షణ పొందుతున్న కుర్రాళ్లు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు. సచిన్, మెక్ గ్రాత్ యువ ఆటగాళ్ల ప్రశ్నలకు బదులిస్తారు. కుర్రాళ్లకు ఇదో మహదవకాశం అని ఫౌండేషన్ అధికారి ఒకరు తెలిపారు.