: 'మీతో కలసి బాబీ ఎప్పుడొస్తుంది?'... రాహుల్ ను ప్రశ్నించిన అమేథీ ప్రజలు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వారంలో ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గం అమేధీలో పర్యటిస్తున్నారు. తన నియోజకవర్గంలో పర్యటించడం ఆయనకు ఇదేమి తొలిసారి కాదు. అయితే తన నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరూ తనను అడగని ప్రశ్నను ఈసారి ఒకరు అడిగారు. అదేంటంటే... "భయ్యా, కబ్ తక్ అకేలా ఆయేగా? బాబీ కబ్ సాత్ ఆయేంగి? (ప్రతిసారీ మీరొక్కరే అమేథీ పర్యటనకు వస్తారు? మరెప్పుడు బాబీ (అతని భార్య) మీతో వస్తుంది?" అని తన గెస్ట్ హౌస్ కు రాహుల్ వెళ్లే ముందు ఓ గ్రామస్థుడు అడిగినట్టు వార్తా పత్రికల కథనాలు పేర్కొన్నాయి. అయితే గ్రామస్థుడు అడిగిన ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వకుండా చిన్నగా నవ్వి రాహుల్ వెళ్లిపోయారట. ఏదేమైనా కాంగ్రెస్ వారసుడైన 45 ఏళ్ల రాహుల్ ఎక్కడికెళ్లినా ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఆయన కూడా జవాబు ఇవ్వకుండా తప్పించుకుంటూనే ఉన్నారు. బహుశా సరైన సమాధానం ఇవ్వాలంటే ఆలోచించడానికి రాహుల్ కు కొంత సమయం అవసరమేమో!