: కాశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం వద్దు: బీజేపీ


కాశ్మీర్ పై ఎన్ఎస్ఏ స్థాయిలో చర్చలు జరగనున్న నేపథ్యంలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ అంశాన్ని మరోసారి పాకిస్థాన్ లేవనెత్తడంపై బీజేపీ స్పందించింది. ఈ విషయంలో మూడవ పార్టీ జోక్యం వద్దని స్పష్టం చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, యూఎన్ఓలో చర్చల అంశాన్ని రెచ్చగొట్టేందుకు పాక్ ఈ విషయాన్ని లేవనెత్తిందన్నారు. అయితే యునైటెడ్ నేషన్స్, ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కు సంబంధించినంతవరకు అది రెండు దేశాల ద్వైపాక్షిక చర్చల అంశమని అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఈ విషయంలో మూడోవ్యక్తికి ఏమాత్రం చోటు లేదని సింగ్ తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News