: కేసీఆర్ సభకు విచ్చేసిన పాము... హడలిపోయిన ప్రజలు


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం గ్రామజ్యోతి కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో కేసీఆర్ సభ ఏర్పాటు చేశారు. అయితే, అనుకోని అతిథిలా ఓ సర్పరాజం ఆ సభా ప్రాంగణంలో ప్రవేశించి హల్ చల్ చేసింది. సభలో పాము ప్రత్యక్షం కావడంతో ప్రజలు హడలిపోయి పరుగులు పెట్టారు. అధికార గణం స్పందించినా ప్రయోజనం లేకపోయింది. ఆ పాము సమీపంలోని ఓ పుట్టలో దూరింది. దాంతో, అందరూ కాస్తంత ఊపిరిపీల్చుకున్నారు. సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రమే ఎర్రవల్లి చేరుకున్నారు. ఆయనకు అక్కడ వ్యవసాయ క్షేత్రం ఉంది.

  • Loading...

More Telugu News