: ‘వరల్డ్ 100 మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీస్’ జాబితాలో మూడు భారతీయ కంపెనీలు
విశ్వ విపణిలో భారతీయ నిపుణులే కాదండోయ్, భారతీయ కంపెనీలు కూడా సత్తా చాటుతున్నాయి. ఫోర్బ్స్ మేగజీన్ తాజాగా విడుదల చేసిన ‘వరల్డ్ 100 మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీస్’ జాబితాలో మూడు భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. జాబితాలో హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీ 41వ స్థానంలో నిలవగా, టాటా సన్స్ గ్రూపునకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 64వ స్థానంలో నిలిచింది. ఇక భారత అపర కుబేరుడిగా అవతరించిన దిలీప్ సంఘ్వీ నేతృత్వంలోని సన్ ఫార్మాస్యూటికల్స్ 71వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన టెస్లా మోటార్స్ అగ్రభాగాన నిలిచింది. ఇక ప్రపంచంలోనే కార్పొరేట్ దిగ్గజంగా పేరుగాంచిన కోకా కోలా కంపెనీ ఈ జాబితాలో 81వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం.