: ప్రిన్సిపాల్, హెడ్ మిస్ట్రెస్ ప్రేమలో పడ్డారట... సెలవిచ్చి దొరికిపోయారు!


ఓ ప్రిన్సిపాల్, మరో హెడ్ మిస్ట్రెస్... ప్రేమలో పడ్డారు. ఏకాంతంగా గడిపేందుకు సమయం చిక్కలేదో ఏమో! పాఠశాలకు సెలవిచ్చేశారు. ఓ గదిలోకి దూరిపోయి విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. పాఠశాలలో చదివే విద్యార్థులు మూడు గంటల ముందుగానే ఇళ్లకు చేరడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారు వెళ్లి చూడగా, ఓ గదిలో అభ్యంతరకర స్థితిలో ఉన్న ఈ ప్రేమ జంట కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, ఆపై స్టేషన్ బెయిలిచ్చి వారిని విడుదల చేశారు. వీరిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించగా, తామేమీ తప్పు చేయలేదని ఈ జంట చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News