: ఆ నగరంలో ఒక్క రోజుంటే 40 సిగరెట్లు ఊదేసినట్టేనట!


నిజమేనండోయ్, ప్రపంచంలోనే మేటి నగరంగా పేరుగాంచిన చైనా రాజధాని బీజింగ్ లో కేవలం ఒక్క రోజుంటే, ఏకంగా 40 సిగరెట్లు తాగినంత దుష్ప్రభావం కొని తెచ్చుకున్నట్టేనట. ఎందుకంటే, వాయు కాలుష్యం ఆ నగరంలో తారస్థాయికి చేరిందట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ప్రాణాలను బలిగొంటున్న వాయు కాలుష్యం ఏటా 30 లక్షల మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఆ మరణాల్లో సగం చైనాలోనే సంభవిస్తున్నాయి. థర్మల్ పవర్ కేంద్రాల వల్ల ఉత్పత్తి అవుతున్న కాలుష్యాలు గాలిలో కలుస్తున్న కారణంగానే చైనాలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కాలుష్యాల కారణంగా చైనాలో రోజుకు 4 వేల మంది చనిపోతున్నారని ఆ దేశ గణాంకాలు చెబుతున్నాయి. చైనా రాజధాని బీజింగ్ విషయానికొస్తే పరిస్థితి మరింత విషమంగా ఉంది. అక్కడ కేవలం ఒక్క రోజు ఉంటే, ఏకంగా 40 సిగరెట్లు తాగినంత కాలుష్యం మన ఊపిరితిత్తుల్లోకి చేరిపోతుందట. అగ్రరాజ్యం అమెరికాతో అన్ని విషయాల్లో పోటీ పడుతున్న చైనాకు ఈ ఒక్క అంశం పెద్ద తలనొప్పిగా మారింది. 2022 వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ ను దక్కించుకున్న చైనా, మరి ఈ కాలుష్యానికి అప్పటికల్లా ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News