: బ్రెస్ట్ క్యాన్సర్‌ పెరుగుదలను నెమ్మదింపజేసే ఆస్పిరిన్‌


కొద్ది కొద్ది డోసేజీల్లో ఆస్పిరిన్‌ మాత్రలు వాడడం అనేది మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌ వ్యాపించడాన్ని నెమ్మదింపజేస్తుందిట. క్యాన్సర్‌ కణితిల పెరుగుదలను ఇది నెమ్మదిగా మారుస్తుందని ఓ సరికొత్త అధ్యయనం చెబుతోంది. కొన్ని తరాలుగా.. తలనొప్పి మాత్రగా సేవలందిస్తున్న ఆస్పిరిన్‌ రొమ్ము క్యాన్సర్‌పై కూడా ప్రభావం చూపగలదని వీరు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ కన్సాస్‌ మెడికల్‌ సెంటర్‌, కన్సాస్‌ సిటీలోని వెటెరన్స్‌ అఫైర్స్‌ మెడికల్‌ సెంటర్‌ వారు కలిసి నిర్వహించిన అధ్యయనంలో క్రమం తప్పకుండా.. తక్కువ డోసేజీలో ఆస్పిరిన్‌ వాడితే మంచిదని తేల్చారు. గుండెజబ్బుల ప్రమాదం తగ్గించుకునేందుకు ఆస్పిరిన్‌ వాడే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ కూడా పరిమితం అవుతుందిట. దీనివెనుక శాస్త్రీయమైన లింకు ఏమిటో తేలకపోయినప్పటికీ శాస్త్రవేత్తలు ఆ విషయం వెల్లడించారు. ఆస్పిరిన్‌ క్యాన్సర్‌ కణాలతో పోరాడుతుందని అధ్యయనంలో తేల్చారు. ఈ బృందంలో భారతీయ సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News