: రుణాలివ్వని బ్యాంకులుగా రిలయన్స్, ఎయిర్ టెల్, వోడాఫోన్!


ప్రధాన మొబైల్ సేవల సంస్థలన్నింటికీ బ్యాంకింగ్ రంగంలోకి ఆహ్వానం పలుకుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఈ సంస్థలు నాన్ లెండింగ్ పేమెంట్ బ్యాంకులుగా ప్రజలకు సేవలందించవచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్యా బిర్లా నువో, డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్స్ లకు అనుమతిచ్చింది. వీటితో పాటు ఎయిర్ టెల్ ఎం కామర్స్ సర్వీసెస్, ఫినో పే టెక్ లిమిటెడ్, ఎన్ఎస్డీఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్), దిలీప్ శాంతిలాల్ సంఘ్వి, టెక్ మహీంద్రా లిమిటెడ్, వోడాఫోన్ ఎం-పైసా తదితర సంస్థలను కూడా అనుమతించింది. ఈ కంపెనీలు ప్రజల నుంచి రూ. లక్ష వరకూ డిపాజిట్లను స్వీకరించి ఇంటర్నెట్ బ్యాంకింగ్, నగదు బదలీలు, బీమా, మ్యూచువల్ ఫండ్స్ అమ్మకాలు తదితర సేవలను అందించవచ్చు. వీటితో పాటు డెబిట్ కార్డులను జారీ చేయవచ్చు. అయితే, ఈ కంపెనీలేవీ క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి కానీ, రుణాలివ్వడానికి కానీ వీలుండదు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి మరింత డబ్బును చలామణిలోకి తేవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకులను మరింత దగ్గర చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News