: మంత్రి జూపల్లిపై మండిపడ్డ రేవంత్ రెడ్డి
తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావుపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జూపల్లి పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏ నియోజకవర్గంలోనైనా ఎలాంటి అభివృద్ధి పని జరిగినా స్ధానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించాలని... కానీ కొడంగల్ లో జరుగుతున్న కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేనైన తనకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పనులు చేపట్టే అధికారం జూపల్లికి ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పెద్ద దొర అయితే జూపల్లి చిన్న దొరలా వ్యవహరిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. పోలీసులు కూడా వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.