: కారును వదిలి రైల్లో ప్రయాణించిన హరీశ్ రావు... స్వల్ప గాయాలే కారణం


తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావుకు నిన్న స్వల్ప గాయాలైన సంగతి తెలిసిందే. పలు కార్యక్రమాలకు హాజరయ్యే నిమిత్తం నిన్న ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన హరీశ్ రావు, జిల్లాలోని వేంసూరు మడలం కల్లూరుగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహం దగ్గరి నుంచి తిరిగి వస్తుండగా కాలు జారడంతో హరీశ్ రావు కిందపడిపోయారు. దీంతో మంత్రి నడుము, కాలికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సత్తుపల్లి వైద్యులు హుటాహుటీన కల్లూరుగూడెంకు చేరుకుని మంత్రికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం హరీశ్ రావు తన కారులో కాకుండా రైల్లో హైదరాబాదు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News