: మరో బలవన్మరణం, హాస్టల్ లో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థిని రవళి


కాలేజీల్లో విద్యార్థినుల బలవన్మరణాలు ఆగడం లేదు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి, కడప జిల్లాలోని నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు మరవక ముందే మరో అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గూడూరులోని డీఆర్ డబ్ల్యూ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగింది. కళాశాల హాస్టల్ గదిలో ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని రవళి ఉరేసుకుని మరణించింది. ఆమె ఉరేసుకుని ఉండటాన్ని చూసిన ఇతర విద్యార్థినులు కళాశాల అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రవళి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News