: మోసం చేసేందుకే బీహార్ కు ప్యాకేజీ ఎర: లాలూ


బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన భారీ ప్యాకేజీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 15 నెలల నుంచి బీహార్ ను విస్మరించిన మోదీ ఎన్నికల ముందు ప్యాకేజీ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేయడానికే ఈ ప్యాకేజీ ఎర వేశారని పాట్నాలోని వైశ్య ప్రతినిధి సమ్మేళనంలో పాల్గొన్న సందర్భంగా లాలూ విమర్శించారు. దాంతో కొంతమందినే కాకుండా మోదీ అందరినీ ఫూల్స్ చేశారని ఆరోపించారు. ఇదే సమయంలో ఆయన దేవుడిని కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇన్ని నెలల పాలనలో ఒక్క హామీనైనా అమలు చేసినట్టు ఆధారం చూపించాలని లాలూ సవాల్ చేశారు. జరగబోయే ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీ(యూ)-కాంగ్రెస్ కూటమి చేతిలో బీజేపీకి పరాభవం తప్పదని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News