: మరో వికెట్ ఢమాల్... భారత్ స్కోరు 15/2
శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా టాప్ ఆర్డర్ కూలుతోంది. దమ్మిక ప్రసాద్ బౌలింగ్ ధాటికి 12 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. మురళీ విజయ్ డకౌట్ అయిన తర్వాత బరిలోకి దిగిన రహానే కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ప్రసాద్ బౌలింగ్ లో కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం లోకేష్ రాహుల్ (6)కు కెప్టెన్ విరాట్ కోహ్లీ జతకలిశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు.