: ఏపీలో నిట్ కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు... హాజరైన స్మృతి ఇరానీ, వెంకయ్య


నవ్యాంధ్రప్రదేశ్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి అంకురార్పణ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం నిట్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ ఏడాది నుంచే నిట్ లో తరగతులు ప్రారంభం కానున్నట్లు గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

  • Loading...

More Telugu News