: పవన్ ట్వీట్లపై అమరావతి రైతుల ఆగ్రహం!


నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని మూడు నాలుగు గ్రామాల రైతులకు బాసటగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రైతుల మధ్య చిచ్చు పెట్టేవిగా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా తుళ్లూరు మండలంలోని రైతులు పవన్ ట్వీట్లను తప్పుపడుతున్నారు. 98 శాతం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే, మిగిలిన రెండు శాతం భూములకు చట్టం నుంచి మినహాయింపు కోరడం బాధ్యతారాహిత్యమని వారు అంటున్నారు. రాజధాని నిర్మాణానికి అవాంతరాలు ఏర్పడేలా పవన్ వ్యవహరిస్తున్నారని లింగాయపాలెం సర్పంచ్ సత్యనారాయణ విమర్శించారు. 45 వేల మంది రైతుల త్యాగాలను మరచిపోయి, వంద మంది రైతులను వెనకేసుకొస్తున్నారని ఆయన అన్నారు. పవన్ కు రైతులపై ప్రేమ ఉంటే అందరికీ ఒకే విధమైన న్యాయం చేసేందుకు కృషి చేయాలని రైతులు అంటున్నారు.

  • Loading...

More Telugu News