: నాగం ఏర్పాటు చేసిన సంస్థ బీజేపీదా? లేక టీడీపీదా?: టీఆర్ఎస్
బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ బచావో మిషన్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ ప్రారంభం సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై నాగం నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు. నాగం వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, వినయ్ భాస్కర్ లు మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగానే తమ అధినేత కేసీఆర్ పై నాగం జనార్దన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆయన ఏర్పాటు చేసిన సంస్థ బీజేపీదా? లేక టీడీపీదా? అన్న విషయాన్ని నాగం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.