: గూగుల్ ను మరచి, ఫేస్ బుక్ వెంట!
ఇంటర్నెట్ ట్రాఫిక్ విషయంలో గూగుల్ ఆధిపత్యానికి గండి పడింది. నెటిజిన్లు గూగుల్ ను మరచి ఫేస్ బుక్ వెంట అధికంగా పరుగులు పెడుతున్నారట. సైట్ల రద్దీపై పర్సాడాట్ లీ అనే కంపెనీ ఓ అధ్యయనం నిర్వహించగా గూగుల్ ను ఫేస్ బుక్ అధిగమించిందని తేలింది. న్యూస్ సైట్ల రద్దీలో ఫేస్ బుక్ లో 43 శాతం రద్దీ కొనసాగుతుండగా, గూగుల్ 35 శాతానికి మాత్రమే పరిమితమైందని వివరించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన లింకులు నెటిజన్లకు సమాచారాన్ని అందిస్తున్న ప్రధాన వనరులుగా మారాయని తెలిపింది. కాగా, గత అక్టోబర్ లో గూగుల్ పై స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఫేస్ బుక్, ఇప్పుడు భారీ వ్యత్యాసాన్ని చూపుతుండటం గమనార్హం.