: ఈడీ డైరెక్టర్ పై వేటు... కీలక సమయంలో కేంద్రం నిర్ణయం


దేశంలో ఆర్థిక సంబంధిత నేరాలపై కొరడా ఝుళిపిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కేంద్రం షాకిచ్చింది. ఆ సంస్థ డైరెక్టర్ పై ఉన్నపళంగా వేటు వేసింది. నిన్నటిదాకా ఈడీ డైరెక్టర్ గా రాజన్ ఎస్ కటోష్ వ్యవహరిస్తున్నారు. ఈడీ డైరెక్టర్ పదవి నుంచి ఆయనను తొలగిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీలో ప్రస్తుతం స్పెషల్ డైరెక్టర్ గా ఉన్న కర్నాల్ సింగ్ కు డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కర్నాల్ సింగ్ మూడు నెలల పాటు ఈడీ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు. కటోష్ పదవీ కాలం అక్టోబరు 31 దాకా ఉంది. అయినా ఆయనను తప్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక గల కారణాలు తెలియరాలేదు. దేశవ్యాప్తంగా పలు సంచలన కేసుల దర్యాప్తులో ఈడీ వేగం పెంచిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News